కేరళలోని తలసేరీకి చెందిన 18 ఏళ్ల శ్రీ నందా అనే అమ్మాయి బరువు తగ్గడానికి ఓన్లీ వాటర్ డైట్ ని ఆరు నెలల పాటు కొనసాగించింది. 6 నెలల పాటు సరైన ఆహరం తీసుకోకుండా కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగింది. మెల్లగా ఆ అమ్మాయి ఆరోగ్యం క్షిణించడం మొదలయింది. చివరకు హాస్పిటల్ లో చేర్పించారు. వెంటిలేటర్ సహాయంతో 12 మాత్రమే బ్రతకగలిగింది. ఎక్కడో సోషల్ మీడియాలో బరువు తగ్గడానికి చూసిన డైట్ ఆ అమ్మాయి ప్రాణాలను తీసింది.